ఆకాశంలో ఒక తార ప్రీమియర్స్ టాక్

Aakasamlo Oka Tara Premieres TalkAakasamlo Oka Tara Premieres Talk

 

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ ఈ మూడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు కాదు వారి మనసులో గుడి కట్టించుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈమధ్య కాలంలో మలయాళంలో నేరుగా చేసిన సినిమాలేవీ వర్కౌట్ అవ్వలేదు. మళ్లీ తెలుగులోనే పవన్ సాధినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అంటూ చేసిన సినిమా పెద్దగా అంచనాలు లేకుండానే నిన్న గురువారం సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఆకాశంలో ఒక తార ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే.. దుల్కర్ సల్మాన్, సాత్విక జంట ఫ్రెష్ గా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకుల హృదయాలను తాకుతున్నాయి. కీ రోల్ లో శృతి హాసన్ ఆకట్టుకుంది. అద్భుతమైన స్టోరీ, డైలాగ్స్, ఎమోషన్స్, మ్యూజిక్ అన్ని ఆకాశంలో ఒక తార కు మెయిన్ హైలెట్స్ గా నిలుస్తున్నాయంటూ ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు చెబుతున్న మాట.

నెమ్మదిగా సాగే కథనం అక్కడక్కడా ఇబ్బంది పెట్టినా ఆకాశంలో ఒక తార ప్రతి అమ్మాయి వీక్షించాల్సిన సినిమా అంటూ చాలామంది ప్రేక్షకులు ఆకాశంలో ఒక తార చూసి సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఈ చిత్రం ఎలా ఉందొ అనేది పూర్తి సమీక్షలో మరి కాసేపట్లో..

 

Aakasamlo Oka Tara Social Media Talk