విదేశాల్లో ఉన్నా సంప్రదాయాలు మరవని PC
Priyanka Chopra's Daughter Malti Marie Recites Gayatri Mantra
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా కూతురు మాల్తీ మేరీ గాయత్రీ మంత్రాన్ని చదువుతున్న ముద్దులొలికే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూజా మందిరం ముందు తల్లి ఒడిలో కూర్చుని చిన్నారి మాల్తీ ఓం భూర్భువః స్వః అంటూ మంత్రాన్ని పఠించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోతో పాటు బీచ్ వెకేషన్‌కు సంబంధించిన పలు అందమైన ఫోటోలను కూడా ప్రియాంక షేర్ చేశారు. బీచ్‌లో మాల్తీ ఇసుకపై బొమ్మలు వేస్తూ ఆడుకుంటున్న దృశ్యాలు.. తల్లి మధు చోప్రా సముద్ర తీరంలో సేదతీరుతున్న ఫోటోలు పోస్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ కూతురికి భారతీయ సంప్రదాయాలు, ఆచారాల విలువలను నేర్పిస్తూ ప్రియాంక పంచుకుంటున్న క్షణాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సినిమాల విషయానికి వస్తే ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ నటుడు రస్సెల్ క్రోతో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. మరోవైపు మహేశ్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` లోనూ ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
















































