బిగ్ బాస్ టాప్ 5 ఫిక్స్ చేసిన శివాజీ
Shivaji has finalized the Bigg Boss top 5
బిగ్ బాస్ సీజన్ 10 పది వారాలు పూర్తి చేసుకుని పదకొండో వారంలో ఉంది. గత వారం శ్వేతా నాయుడు ఎలిమినేట్ కాగా.. ఈ వారం కెప్టెన్ నరేష్ తప్ప మిగతా హౌస్ మొత్తం నామినేషన్స్ లోకి వచ్చారు. ఎక్స్ హౌస్ మేట్స్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి మరీ హౌస్ మేట్స్ ని నామినేట్ చేసారు. కెప్టెన్ నరేష్ కి రెండు నామినేషన్స్ వేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.
ఇక టాప్ 5 లో ఎవరు ఉంటారనే విషయంలో ప్రేక్షకుల్లో ఆల్మోస్ట్ ఓ క్లారిటీ వచ్చేసింది. అందులో త్రిగుణ, ముఖేష్, అమన్, నరేష్ లేదా రామ్ ప్రసాద్. దేబ్జానీ ఉండొచ్చనే ఊహాగానాలు ఆడియన్స్ లో నడుస్తున్నాయి. అయితే బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ టాప్ 5 లో ఎవరు ఉండొచ్చనే అలీ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
అలీ బిగ్ బాస్ సీజన్ 10 లో టాప్ 5 లో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నావు అని శివాజీని అడిగితె.. దానికి శివాజీ సీజన్ 10 టాప్ 5 లో వీళ్ళు ఉండొచ్చు అని అలీ షో లో ప్రెడిక్ట్ చెయ్యడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖేష్, త్రిగుణ, నరేష్, దేబ్జానీ ఉండొచ్చు, రామ్ ప్రసాదా, లేదంటే వంశి నా లేదు అంటే అమన్ ఒకడు ఉండొచ్చు అని శివాజీ అలీ షో లో సీజన్ 10 టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్స్ గురించి చెప్పడం ఆసక్తిగా మారింది.
















































