ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Dulquer Salmaan Prank Calls Vijay Deverakonda

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు షాక్ ఇచ్చిన స‌ల్మాన్!

Dulquer Salmaan Prank Calls Vijay DeverakondaDulquer Salmaan Prank Calls Vijay Deverakonda

మలయాళ, తెలుగు సినిమాల్లో తనదైన ఆకర్షణతో అలరిస్తున్న హీరో దుల్కర్ సల్మాన్ సన్నిహితుడైన విజయ్ దేవరకొండ తో చేసిన‌ సరదా ప్రాంక్ నెట్టింట నవ్వులు పూయిస్తుంది. దుల్క‌ర్ కొత్త సినిమా `ఆకాశంలో ఒక తార` ప్రమోషన్లలో భాగంగా దుల్కర్ ఫన్నీ ప్లాన్ వేశారు. తన ఫోన్ పోయిందంటూ ఒక చిన్నారితో విజయ్‌కు ఫోన్ చేయించగా అది నిజమేనని నమ్మిన విజయ్ దేవరకొండ ఫోన్ తిరిగి ఇప్పించేందుకు వెంటనే సహాయం చేయడానికి ముందుకు రావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

`ఆకాశంలో ఒక తార` ప్రమోషన్స్ సందర్భంగా చిన్నారులతో కూర్చున్న దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండకు కాల్ చేస్తారు. స్క్రీన్‌పై DQ అని కనిపించడంతో విజయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అయితే దుల్కర్‌కు బదులు ఒక చిన్నారి లైన్‌లోకి వచ్చి రోడ్డుపై ఒక ఫోన్ దొరికిందని.. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ చూసి మీకు కాల్ చేస్తున్నానని చెబుతుంది. ఆ మాటలను నిజంగానే నమ్మిన విజయ్ ఆ ఫోన్‌ను ఎవరికి అప్పగించాలో ఒక నంబర్ ఇచ్చి స్పష్టమైన సూచనలు ఇస్తారు.

ఫోన్ దొరికిన విషయంలో విజయ్ చూపిన బాధ్యతాయుత స్పందన తర్వాత దుల్కర్ సల్మాన్ మరోసారి ఫోన్ చేసి అసలు విషయాన్ని బయటపెడుతారు. జపాన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న విజయ్‌ను ఇలా సరదాగా ఆటపట్టించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన `ఆకాశంలో ఒక తార` చిత్రం నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

 

Dulquer Salmaan prank-called Vijay Deverakonda during promotions for Aakasamlo Oka Tara