ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> January 12 Vidudala First Single Update

రావిపూడి ని తట్టుకోవడం కష్టమే!

January 12 Vidudala First Single UpdateJanuary 12 Vidudala First Single Update


దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలు ఎంత ఫాస్ట్ గా చేస్తూ మిగతా దర్శకులకు టార్గెట్ ఇస్తారో.. ఆయన ప్రమోషనల్ స్ట్రాటజీని పట్టుకోవాలన్నా దర్శకులు అంతే కిందా మీదా పడాలి. సినిమా రిలీజ్ తేదీ ప్రకటించడమే తరువాయి పనిలో దిగిపోతారు. సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారమే చిత్రీకరిస్తూ బుల్లితెర షోస్ లో జెడ్జి గా కనిపిస్తూ షాకిస్తారు.

అనుకున్న షెడ్యూల్ కి షూటింగ్ ఫినిష్ చేసేస్తారు, ఇక ప్రమోషన్స్ స్టాట్ చేసారు అంటే అందరి చూపు ఆ సినిమాపైనే ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. 2027 సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాల జాబితాలో అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల చిత్రం పై ముందుగా ఆసక్తి క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేసేసారు.

మ్యూజికల్ జర్నీ ని స్టార్ట్ చెయ్యడమే ఇద్దరి హీరోయిన్స్ ని ట్రాక్ లో పెట్టేసారు. మీరు లేకుండా రీల్స్ చేద్దామనుకుంటున్నాము నేను కీర్తి సురేష్ అని కృతి శెట్టి అనగానే అనిల్ రావిపూడి నేను లేకుండా రీల్స్ ప్రమోషన్స్ చేస్తారా అంటూ కోపం చూపిస్తూనే జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.

మరి సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తోనే సమయం సరిపోక కిందా మీద పడే దర్శకులకు అనిల్ రావిపూడి ప్రమోషనల్ ఛాలెంజ్ ని తట్టుకోవడం కష్టమే. 

January 12 Vidudala Musical Journey Start