ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sai Pallavi Returns with Om After Ramayana Success

సక్సెస్ ని కంటిన్యూ చేస్తుందా?

Sai Pallavi Returns with Om After Ramayana SuccessSai Pallavi Returns with Om After Ramayana Success

 

రామాయణ చిత్రంతో పాన్ ఇండియా మర్కెట్ లో బిగ్ హిట్ అందుకున్న సాయి పల్లవి ఆ సక్సెస్ జోరు ని ఓం చిత్రం తో కంటిన్యూ చేస్తుందా.. అని ఆమె అభిమానులు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రామాయణ చిత్రంలో సీత గా కనిపిచిన సాయి పల్లవి పై ఎలాంటి విమర్శలొచ్చినా.. రామాయణ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

సినిమా విడుదలైన రెండు వారాలు అవుతున్నా ఇప్పటికి రామాయణ జోరు బాక్సాఫీసు దగ్గర కనిపిస్తుంది. మరి రేపు శుక్రవారం విడుదలవుతున్న సాయి పల్లవి ఓం చిత్రం కూడా ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తే సాయి పల్లవి ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడతాయి. ధనుష్ హీరోగా సాయి పల్లవి, శ్రీలీల కలయికలో ఓం తెరకెక్కింది.

మమ్ముట్టి విలన్ పాత్రలో కనిపిస్తున్న ఓం పై తెలుగు, తమిళంలో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ సాధారణ హెడ్ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తుంది. మరి ఓం తో కూడా హిట్ కొట్టి సాయి పల్లవి రామాయణ సక్సెస్ ని కంటిన్యూ చేస్తుందో, లేదో అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. 

Sai Pallavi