శ్రీరాములు థియేటర్ లో ఈషా-తరుణ్ భాస్కర్
Eesha Rebba and Tharun Bhascker at Sriramulu Theatre
దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బ గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారనే ప్రచారానికి ఆ ఇద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా తరుణ్ భాస్కర్ తల్లి, నటి గీతా భాస్కర్ మీడియా ముందు వారి బంధాన్ని బయటపెట్టేసారు. తరుణ్ భాస్కర్ కి రెండేళ్లుగా ఈషా రెబ్బ ఏంతో సపోర్ట్ గా తమ ఫ్యామిలిలో ఒకరిగా ఉంది అంటూ ఆమె మీడియా ముఖంగా ఈషా రెబ్బ కు థాంక్స్ చెప్పారు.
దానితో తరుణ్ భాస్కర్ తల్లి గీత భాస్కర్ వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే విషయాన్నీ చెప్పకనే చెప్పేసారు. అలా జరిగిన 24 గంటల్లోనే తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి ఒకే కారులో ENE రిపీట్ చిత్ర ప్రీమియర్ ని వీక్షించేందుకు మూసాపేట లోని శ్రీరాములు థియేటర్ కి వెళ్లిన వీడియోస్ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చక్కర్లు కొడుతున్నాయి.
అయితే తరుణ్ భాస్కర్ ఇంకా ఈషా రెబ్బ తమ బంధాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాలనుకున్నారు కానీ, ఈలోపే తరుణ్ భాస్కర్ తల్లి గీత భాస్కర్ ఆ విషయాన్ని సినిమా ఈవెంట్ లో రివీల్ చేసేసారట. సో వారు త్వరలోనే పెళ్లి చేసుకున్నా పెద్దగా షాకవ్వాల్సిన పని లేదు.
















































