ENE రిపీట్ ప్రీమియర్స్ టాక్

ENE Repeat Premieres TalkENE Repeat Premieres Talk

 

విశ్వక్ సేన్, అభిన‌వ్ గోమ‌టం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ ల కలయికలో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది విడుదలైనప్పుడు ఓకే ఓకే టాక్ తో థియేటర్స్ లో రన్ అయిన చిత్రం ఆతర్వాత యూట్యూబ్ లో యూత్ కి కనెక్ట్ అయ్యింది. ఈ నగరానికి ఏమైంది సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ హైప్, క్రేజ్ తో ఈ నగరానికి ఏమైంది కి సీక్వెల్ అంటూ సైలెంట్ గా తెరకెక్కించి ENE రిపీట్ ని మంచి అంచనాలతో ఆడియెన్స్ ముందుకు తెచ్చేసారు.

గత రాత్రే ENE రిపీట్ ప్రీమియర్స్ తో జోరుని స్టార్ట్ చేసేసింది. ENE రిపీట్ ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే.. సినిమా ఆరంభం అయిన 15 నిమిషాలకు గానీ కథలో కాన్ ఫ్లిక్ట్ మొదలవ్వదు, ఫస్ట్ హాఫ్ అంతా సరదసరదాగా సాగుతుంటుంది. అభిన‌వ్ గోమ‌టం కేరెక్టర్ తో ఫన్ క్రియేట్ చెయ్యడంలో తరుణ్ భాస్కర్ 100 శాతం సక్సెస్ అయ్యారు.

కానీ సెకండాఫ్‌ కి వచ్చేసరికి కథ ఎటెటో పోయినట్టు అనిపిస్తుంది. అభిన‌వ్ గోమ‌టం అక్కడక్కడా నవ్వించినా చివరి 40 నిమిషాలు కాస్త కథ గాడిన పడుతుంది. గెస్ట్ అప్పియరెన్స్‌గా వచ్చిన దర్శకులు, వారి సీన్స్ అన్నీ కూడా థియేటర్లో పేలుతాయి. ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ అభినవ్ గోమటం కామెడీ. వివేక్ పాత్రలో విశ్వక్ ఓకే అనిపిస్తాడు. కానీ కౌశిక్ పాత్రతోనే అసలు కామెడీ, సినిమా అంతా నడుస్తుంది.

విజువల్స్, ఎడిటింగ్, మ్యూజిక్, BGM అన్ని ENE రిపీట్ కి ఎక్సట్రార్డినరీ అంటూ ఆడియన్స్ చెబుతున్న మాట. మరి ENE రిపీట్ ఫైనల్ గా ఎలా ఉందొ అనేది పూర్తి సమీక్షలో మరి కాసేపట్లో..

ENE Repeat Social Media Talk