కడుపులో అలియా ఉందని తెలియక 100 సిగరెట్లు తాగిందట!
Soni Razdan recalls smoking nearly 100 cigarettesబాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లి ..సీనియర్ నటి సోనీ రజ్దాన్ గతానికి సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. 1993లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన `గుమ్రా` సినిమా షూటింగ్ సమయంలో తాను గర్భవతిని అనే విషయం తెలియక ఒకే రోజు 100 సిగరెట్లు కాల్చేశానని వెల్లడించారు. అప్పట్లో తన కడుపులో అలియా భట్ పెరుగుతోందనే కనీస ఆలోచన కూడా తనకు లేదని.. ఆ సినిమాలోని ఒక సన్నివేశం కోసం తాను అలా చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
నిజ జీవితంలో సిగరెట్ తాగే అలవాటు అస్సలు లేదని సోనీ రజ్దాన్ స్పష్టం చేశారు. అయితే `గుమ్రా` చిత్రంలో ముఖ్యమైన సీన్ డిమాండ్ మేరకు వరుసగా సిగరెట్లు కాల్చాల్సి వచ్చిందని.. అలా ఒకే రోజులో 100 సిగరెట్లు కాల్చేశానన్నారు. ఆ షూటింగ్ తర్వాత కొద్ది రోజుల పాటు సిగరెట్ తాగాలనే కోరిక విపరీతంగా కలిగిందని.. ఆ సమయంలోనే ఉరిశిక్ష సన్నివేశంలోనూ నటించానని వివరించారు. ఆ తర్వాత షూటింగ్‌కు ఐదు నెలల పాటు బ్రేక్ రావడంతో తిరిగి సెట్స్‌లోకి వెళ్లినప్పుడు వేసుకునే బట్టలు పట్టకపోవడంతో గర్భవతిని అనే విషయం అర్థమైందని.. వెంటనే కాస్ట్యూమ్స్ ఆల్టర్ చేయించుకున్నానని తెలిపారు.
నాటి రోజులతో పోలిస్తే ఇప్పుడు సినీ పరిశ్రమలో పరిస్థితులు ఎంతో మారిపోయాయని సోనీ రజ్దాన్ సంతోషం వ్యక్తం చేశారు. తమ కాలంలో నటీమణులు పెళ్లయిన విషయాన్ని కానీ.. పిల్లలు ఉన్న విషయాన్ని కానీ బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవారని.. కానీ నేడు తన కూతురు అలియా భట్ తల్లిగా ఉంటూనే ఏమాత్రం దాచుకోకుండా కెరీర్‌ను అద్భుతంగా కొనసాగిస్తోందని ప్రశంసించారు.
















































