దశాబ్దాలుగా చారిత్రక గదిలో రితేశ్ దేశ్‌ముఖ్!
Riteish Deshmukh visits V Shantaram’s untouched cabinభారతీయ సినీ పరిశ్రమకు పునాదులు వేసిన దిగ్గజ దర్శకులలో వీరశాంత్ రామ్ ఒకరు. ఆయన సృష్టించిన కళాఖండాలు ఇండస్ట్రీకి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయి. తాజాగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేశ్ దేశ్‌ముఖ్ ముంబైలోని చారిత్రాత్మక రాజ్‌కమల్ స్టూడియోను సందర్శించారు. ఈ సందర్భంగా వీరశాంత్ రామ్ దశాబ్దాల క్రితం ఏ రూమ్‌లో కూర్చుని అద్భుతమైన సినిమాలను తీశారో? ఆ నాటి అన్టచ్డ్ క్యాబిన్ లోకి అడుగుపెట్టే అరుదైన అవకాశం దక్కింది.
ఆ క్యాబిన్‌లోని ప్రతి వస్తువు, వీరశాంత్ రామ్ ఉపయోగించిన తీరు అలాగే భద్రపరచబడి ఉండటాన్ని చూసి రితేశ్ దేశ్‌ముఖ్ ఆశ్చర్యపోయారు. ఈ ప్రత్యేక అనుభవాన్ని పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. `ఇది నాకు ఎంతో ఓవర్వెల్మింగ్ అండ్ హమ్బ్లింగ్ అనుభూతినిచ్చింది. భారతీయ సినిమాకు లెజెండరీ శిఖరంలాంటి వీరశాంత్ రామ్ గారు కూర్చున్న గదిలో అడుగుపెట్టడం.. ఆయన శక్తిని అనుభవించడం మాటల్లో చెప్పలేను. సినిమా చరిత్రను కళ్లారా చూసినట్లనిపించింది` అంటూ సంతోషాన్ని పంచుకున్నారు.
సొంతంగా చిత్రాలను నిర్మిస్తూ.. నటుడిగా .. దర్శకుడిగా రాణిస్తున్న రితేశ్ దేశ్‌ముఖ్‌కు సినిమా చరిత్రపై పాత తరపు దిగ్గజాలపై ఎంతో గౌరవం ఉంది. రాజ్‌కమల్ స్టూడియోలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ చారిత్రాత్మక ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా ఎంతో స్పూర్తి పొందానని తెలిపారు.
















































