పబ్లిసిటి పీక్స్‌.. కలెక్షన్స్‌ వీక్‌

Publicity peaks, collection weakPublicity peaks, collection weak


గత శుక్రవారం విడుదలైన చిత్రాల్లో డెబ్యూ హీరో అనీష్ నటించిన ఇట్లు అర్జున.. భారీ ప్రమోషన్స్ మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కింగ్ నాగార్జున, అఖిల్ వంటి స్టార్స్ ఇట్లు అర్జున్ వెనుక నిలబడ్డారు. అనీష్ ని బాగా ప్రమోట్ చేసారు.

ఒక సాధారణ కుర్రాడు హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, కానీ ఇండస్ట్రీ ప్రముఖులు అతని వెనుక వున్నారు, ఎన్టీఆర్, రామ్ చరణ్ చెబితే టికెట్లు తెగుతాయనుకున్నారు. కానీ ఇట్లు అర్జున కి మంచి ఓపెనింగ్స్ పడలేదు, అలాగే కలెక్షన్స్ కూడా వీక్ గానే ఉన్నాయి. కారణం కొత్త కుర్రాడే. కంటెంట్ ఇంకాస్త ప్రేక్షకులకు ఎక్కి ఉంటె ఇట్లు అర్జున్ వర్కౌట్ అయ్యేది.

మరి కొత్త కుర్రాడు అయినా మూవీ బడ్జెట్ కి, ప్రమోషన్స్ కి కలిపి రూ.35 నుంచి రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ ఇపుడు ఆ పెద్ద మొత్తం రావడం అంటే మాములు విషయం కాదు, సక్సెస్ మీట్ పెట్టి నాగార్జున నా ఫ్రెండ్ కొడుకు అంటే ఎవరూ చూసేవాళ్ళు కాదు అన్నారు. అయినా ప్రేక్షకుల్లో ఊపు లేదు.

ఇట్లు అర్జున ఆ రూ.40 లో రూ.20 తీసుకురావడం కూడా కష్టమని ట్రేడ్ వర్గాలే మాట్లాడుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే పబ్లిసిటి పీక్స్‌.. కలెక్షన్స్‌ టూమచ్‌ వీక్‌.. అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Itlu Arjuna collections Report