వర్షిణి ని కాపాడుతున్న బిగ్ బాస్?
Is Bigg Boss protecting Varshini?
బిగ్ బాస్ సీజన్ 10 లో మొదటి వారం నుంచి ఆటలో జీరో తో కనిపించిన వర్షిణి ని ఆడియన్స్ ఎప్పుడెప్పుడు బయటకు పంపించేద్దామా అని వెయిట్ చెయ్యని వారం లేదు. వర్షిణి నామినేషన్స్ లోకి వస్తే ఆమె డెఫనెట్ గా ఈ వారం వెళ్ళిపోతుంది అనుకున్న ప్రేక్షకులకు షాక్ తగులుతూనే ఉంది.
బోటం లైన్ లోకి వచ్చి సేవ్ అవుతూనే ఉంది వర్షిణి. ఓటింగ్ లో తక్కువ శాతం ఉంటుంది. హౌస్ లో టాస్క్ పెరఫార్మెన్స్ ఉండదు.. అయినా వర్షిణి సేవ్ ఎందుకు అవుతుంది. అంటే ఆమె గ్లామర్ కోసం బిగ్ బాస్ ఆమెను కాపాడుతున్నాడా, ముఖేష్ తో ఉన్న ట్రాక్ కోసం వర్షిణి బిగ్ బాస్ ఎలిమినేట్ చెయ్యకుండా కాపాడుతున్నాడనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈవారం నీతూ మాస్టర్, వర్షిణి లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు, వారే ఈ వారం బోటం లైన్ లో ఉన్నారనుకుంటే.. ఆదివారం ఎపిసోడ్ లో వర్షిణి ని ముందుగా సేవ్ చెయ్యడంతో ఆడియన్స్ కి చిరాకొచ్చేసింది. ఈ వర్షిణి బయటకు పంపిద్దామని చూస్తే బిగ్ బాస్ ఏంట్రా ఆమెను బయటకు పంపించకుండా కాపాడుతున్నాడంటూ కామెంట్లు పడుతున్నాయి.
మరో పక్క టాస్క్ లో దుమ్మురేపుతున్న వైల్డ్ ఫైర్ శ్వేతా నాయుడు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ కి బాగా షాకిచ్చింది.
















































