రాకా: డిజప్పాయింట్ చేసిన అల్లు అర్జున్

Allu Arjun Reacts to RaakaAllu Arjun Reacts to Raaka

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ రాకా అప్ డేట్స్ విషయంలో అల్లు ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. రాకా మొదలు పెట్టి చాలా నెలల అవుతుంది. కానీ ప్రోపర్ గా రాకా అప్ డేట్ ని దర్శకుడి అట్లీ ఇవ్వడం లేదు. అటుపై అల్లు అర్జున్ కూడా పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించకపోవడం తో రాకా విషయాలను అడిగే ఛాన్స్ మీడియాకి కూడా రావట్లేదు.

తాజాగా అల్లు అర్జున్ మలయాళ స్టార్ హీరో దుల్కర్ తెలుగులో నటించిన ఆకాశంలో ఒక తార చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా రావడంతో.. అల్లు అర్జున్ నుంచి ఆడియన్స్, ఇంకా ఫ్యాన్స్ కూడా రాకా అప్ డేట్ ని ఆశించారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసారు.

ఆకాశంలో ఒక తార ఈవెంట్ వేదికపై అల్లు అర్జున్ రాకా అప్ డేట్ షేర్ చేస్తారనే ఉత్కంఠతో మీడియాతో పాటుగా ఆడియన్స్ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ సైలెంట్ గా నాకు తెలుసు, రాకా అప్ డేట్ చాలా లేట్ అవుతోంది. ఇచ్చేప్పుడు డిస్కర్షన్ అవ్వకూడదని.. కొంచెం ఓపిక పట్టమని అల్లు ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు.

కానీ అల్లు అర్జున్ అంత చప్పగా రాకా అప్ డేట్ విషయాన్ని దాట వేయడం మాత్రం అభిమానులను బాగా డిజప్పాయింట్ చేసింది. 

Allu Arjun Reacts to Raaka Update Request at Aakasam Lookatara Event