ఎన్టీఆర్ డెసిషన్ పై ఫ్యాన్స్ లో అయోమయం !
NTR Fans in Big Confusion
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నట్టుండి ఎవరూ ఊహించని విధంగా అనిల్ రావిపూడి తో సినిమా ప్రకటించి అభిమానులకు ప్రేక్షకులకు పెద్ద షాకిచ్చారు. ఎలాంటి లీక్స్ లేకుండా డైరెక్ట్ గా ఎన్టీఆర్ ఈ కాంబో ని ప్రకటించడం అందరిలో ఆసక్తి రేగడం కన్నా ముందు విపరీతమైన చర్చకు దారి తీసింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో క్రేజీ యాక్షన్ పాన్ ఇండియా ఫిలిం డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ఆతర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రకటించిన గాడ్ ఆఫ్ వార్ మూవీ చెయ్యాల్సి ఉంది. అయితే గాడ్ ఆఫ్ షూటింగ్ మధ్యలో ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రకటన ఉండాలి కానీ.. సడన్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో మూవీ అనేసరికి ఫ్యాన్స్ లో అయోమయం మొదలయ్యింది.
త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం అనుకున్న అంచనాలు రీచ్ కానీ కారణంగానే ఎన్టీఆర్ సడన్ గా డెసిషన్ మార్చుకుని త్రివిక్రమ్ మూవీ పక్కన పెట్టి అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. మరోపక్క 2027 మిడిల్ లో మొదలై 2028 లో అనిల్ రావిపూడి తో మూవీ రిలీజ్ చేస్తా అని దిల్ రాజు ప్రకటించారు.
అది ఖచ్చితంగా ఎన్టీఆర్ మూవీ అయితే కాదు కారణం ఎన్టీఆర్-అనిల్ రావిపూడి మూవీకి ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేత కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టుగా ఎన్టీఆర్ చెప్పకనే చెప్పేసారు. సో ఈ కన్ఫ్యూజన్ లోనే ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు.
















































