ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nitesh Tiwari responds to criticism of Sai Pallavi's action scenes as Sita

సీతగా సాయి పల్లవిపై విమర్శలు: నితేశ్ క్లారిటీ

Nitesh Tiwari responds to criticism of Sai Pallavi's action scenes as SitaNitesh Tiwari responds to criticism of Sai Pallavi's action scenes as Sita

 

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీసు దగ్గర సంచలనాలకు నెలవుగా మారిన రామాయణ చిత్రం రూ.1200 కోట్ల క్లబ్బులోకి చేరి మరిన్ని రికార్డులపై కన్నేసింది. ఇండియా నుంచి ఓవర్సీస్ వరకు రామాయణ చిత్రానికి ఆడియన్స్ హారతులు పడుతున్నారు. అయితే రామాయణ లో సీత గా చేసిన సాయి పల్లవి పై సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి బోలెడన్ని విమర్శలొచ్చాయి.

సీత లుక్స్, ఆమె మేకప్ కన్నా ఆమె యోధురాలిగా,యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన తీరుపై ఆమెను విమర్శించారు. తాజాగా సీత పాత్రపై వస్తున్న విమర్శలకు నితేశ్ తివారి క్లారిటీ ఇచ్చారు.15వ శతాబ్దానికి చెందిన ఒడియా బిలంక రామాయణం కథనాల్లో సీత పాత్ర చాలా డిఫ్రెంట్ గా ఉంటుంది. అద్భుత రామాయణంలో  సీత కేవలం కష్టాలను భరించడమే కాకుండా.. ఎంతో శక్తిమంతమైన పోరాట యోధురాలిగా కనిపిస్తారు.

సీత కేవలం సహనానికి ప్రతిరూపమే కాదు.. యుద్ధం చేసే వీరనారి. రామాయణంలోని కొన్ని కథల్లో శ్రీరాముడికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు.. సీత మహాకాళి రూపాన్ని ధరించి, సహస్ర రావణుడిని సంహరిస్తుంది. అలాంటి కథల స్ఫూర్తితోనే మా రామయణలో సీతను అలా చూపించాం అంటూ నితీష్ చెప్పుకొచ్చారు.

Nitesh Tiwari Defends Sai Pallavi's Warrior Sita Avatar Amid Criticism