ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun’s Mythological With Boyapati!

నిన్న ఎన్టీఆర్-నేడు అల్లు అర్జున్

Allu Arjun’s Mythological With Boyapati!Allu Arjun’s Mythological With Boyapati!


నిన్న శనివారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ట్విస్ట్ మాములిది కాదు. అసలు ఊహించని దర్శకుడితో ఆయన సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చారు. పాన్ ఇండియా దర్శకులను పట్టుకుని భారీ స్కెల్ సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ ఉన్నట్టుండి పాన్ ఇండియా వైపు చూడని దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా ఓకే చేసారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ లో మూవీ ఉంటుంది అంటూ అనిల్ రావిపూడి తో దిగిన ఫోటో షేర్ చేసి సర్ ప్రైజ్ షాకిచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ వైపు అడుగులు వేస్తున్నారనే వార్త వైరల్ అవుతుంది. అంటే పాన్ ఇండియా టచ్ లేని డైరెక్టర్ బోయపాటి తో అల్లు అర్జున్ మూవీ ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సరైనోడు చిత్రాల్లో అల్లు అర్జున్ ని ఊర మాస్ గా ప్రేక్షకులకు పరిచయం చేసిన బోయపాటి.. ఆతర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేద్దామనుకుంటే పుష్ప తో పాన్ ఇండియా మర్కెట్ కి వెళ్ళిపోయాడు. తర్వాత అట్లీ, లోకేష్ కనగరాజ్ అంటూ పాన్ ఇండియా మూవీస్ ని లైన్ లోకి తేవడమే కాదు.. త్రివిక్రమ్ తో మూవీ అన్నారు, కానీ అది పట్టాలెక్కే ఛాన్స్ కాన రావటలేదు.

ఇప్పుడు అల్లు అర్జున్ బోయపాటి డైరెక్షన్ లో మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చెయ్యబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి త్రివిక్రమ్ తో ఆ జానర్ నచ్చకే అల్లు అర్జున్ ఆ మూవీ ని లైట్ తీసుకున్నారు, కానీ అదే జానర్ లో బోయపాటి తో హౌ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

Allu Arjun and Boyapati Sreenu to Reunite for a Pan-India Mythological Film