ఎన్టీఆర్ డ్రాగన్ రెండు భాగాలా?
Dragon' to be released in two partsయంగ్ టైగర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా `డ్రాగన్` పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాను ఒకే భాగంగా కాకుండా రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కథ పరిధి, ప్రపంచ నిర్మాణం విస్తృతంగా ఉండటంతో 5 నుండి 6 గంటల నిడివి గల ఫుటేజ్ సిద్ధమవుతోందని ఈ నేపథ్యంలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్`, `సలార్` చిత్రాలు కూడా ముందుగా ఒక భాగంగా అనుకున్నారు. ఆ తర్వాత కథాబలం దృష్ట్యా రెండు భాగాలుగా మారినవే. తాజాగా `డ్రాగన్` విషయంలోనూ అదే ఫార్ములాను అనుసరిస్తూ కంటిన్యుటీ మిస్ అవ్వకుండా రెండు భాగాల షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మొదటి భాగాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు తేదీని ఖరారు చేశారు.
















































