మళ్ళీ తెరపైకి కమల్ హాసన్ టైటిల్ వివాదం
Kamal Haasan's Sandiyar title rowవిశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి టైటిల్ వివాదం తెరపైకి వచ్చింది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు `సండియార్` అనే పేరును ఖరారు చేయడంపై పుతియ తమిళగం పార్టీ నేత క్రిృష్ణసామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో 2003లో కూడా కమల్ హాసన్ ఇదే టైటిల్‌తో సినిమా ప్రకటించగా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పేరును `విరుమాండి`గా మార్చాల్సి వచ్చింది.
ఈ వివాదంపై స్పందించిన చలనచిత్ర నిర్మాత కౌన్సిల్ అధ్యక్షుడు తమిళ కుమారన్ నిబంధనల ప్రకారమే టైటిల్ కేటాయించినట్లు వివరించారు. కౌన్సిల్‌లో రిజిస్టర్ అయిన ఏదైనా టైటిల్‌ను 10 సంవత్సరాల పాటు నిల్వ ఉంచుతామని.. ఆ తర్వాత సదరు నిర్మాత అనుమతితో ఎవరైనా ఉపయోగించవచ్చని తెలిపారు. 13 సంవత్సరాల క్రితం నాటి టైటిల్‌ను కమల్ హాసన్ బృందం కోరడంతోనే కేటాయించామని.. దీనిపై రాబోయే సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు ఈ టైటిల్ దక్షిణాంధ్ర తమిళనాడులో కులగత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని కృష్ణసామి హెచ్చరించారు. ఈ పేరును వారం రోజుల్లోగా మార్చాలని డిమాండ్ చేస్తూ మంత్రి రాజ్ తమిళ కుమారన్‌లకు వినతిపత్రాలు సమర్పించారు. టైటిల్ మార్చకపోతే షూటింగ్ జరిగే ప్రదేశంలో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని.. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించడంతో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది.
















































