ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ramya Krishna has opened up about her married life with director Krishna Vamsi

విడిపోలేదు, విడిగా ఉంటున్నాం-రమ్యకృష్ణ

Ramya Krishna has opened up about her married life with director Krishna VamsiRamya Krishna has opened up about her married life with director Krishna Vamsi


సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఆమె భర్త కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటారు. దానితో వీరిద్దరూ విడిపోయారు, విడాకులు కూడా తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నా ఎప్పుడు రమ్యకృష్ణ కానీ, కృష్ణవంశీ కానీ స్పందించలేదు. రమ్యకృష్ణ, కృష్ణవంశీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రమ్యకృష్ణ కెరీర్ లో టాప్ పొజిషన్ లో ఉంటె.. కృష్ణవంశీ కెరీర్ లో దర్శకుడిగా ఫెయిల్యూర్స్ లో ఉన్నారు.

తాజాగా రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ తో విడిపోయారు, విడాకులు కూడా తీసుకున్నారు అనే రూమర్స్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కృష్ణవంశీ నేను ఇప్పటికీ దంపతులుగానే ఉన్నాం. కాకపోతే ఇద్దరం దూరంగా వేర్వేరు చోట్ల ఉంటున్నాం. కెరీర్ కారణంగానే ఇలా ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే నా కొడుకు పుట్టిన తర్వాత సీరియల్స్ చేస్తున్న టైంలో ప్రతి 15 రోజులకొకసారి చెన్నై వెళ్లొచ్చేదాన్ని.

నేను అలా చెన్నై కి వెళ్లిన ప్రతిసారి నా కొడుకు అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో నేను ఓ డెసిషన్ తీసుకుని నా కొడుకుని చెన్నైలోనే చదివిస్తానని ఆయనతో చెప్పాను. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికీ మేం దంపతులుగానే ఉన్నాం, కానీ అంతకుమించి  మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం.

ప్రేమలో ఉన్నప్పుడే పెళ్లెందుకు చేసుకోవాలి.. లివింగ్ టుగెదర్ చేద్దామని వంశీ చెప్పాడు, కానీ నేనే పెళ్లి బంధాన్ని ఎంచుకున్నాను అంటూ రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

My relationship with Krishna Vamsi is perfect says Ramya Krishna