పిల్లల పని తండ్రి చేస్తే గొప్ప ఎందుకవుతుంది-ఉపాసన
Cute when Ram Charan feeds our kids, says Upasana
ఇప్పుడు పురుషులు-మహిళలు అనే భేదభావం లేకుండా.. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులకు సరిపడా భార్య-భర్తలు సంపాదిస్తున్నారు. ఏ దేశమైనా అంటే అమెరికా అయినా ఇండియా అయినా ఎక్కడైనా ఒక ఇంట్లో భార్య-భర్తలు కష్టపడితేనే ఆ ఇల్లు డబ్బుకు కొదవలేకుండా ఉంటుంది అనే సూత్రాన్ని చాలామంది పాటిస్తున్నారు.
అలాంటప్పుడు భర్త కూడా ఇంట్లో భార్యలకు సహాయం చెయ్యాలి, తన భార్య తనతో పాటుగా బయట కష్టపడి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నప్పుడు భర్తలు భార్యలకు ఇంటిపనుల్లో, పిల్లల విషయంలో హెల్ప్ చెయ్యాలి, అదేదో భర్త ఇంటిపనులు చేస్తున్నాడు, పిల్లల పనులు చూసుకుంటున్నాడని గొప్పగా చెప్పుకోవక్కర్లేదు. అదే నిజం.
ఆ నిజాన్నే మెగా కోడలు ఉపాసన స్టేజ్ పై చెప్పింది. పిల్లల పెంపక తల్లి బాధ్యత మాత్రమేనా, పిల్లలకు తినిపించడం, డైపర్స్ మార్చడం, స్నానం చేయించడం వంటివి తండ్రి చేస్తే గొప్ప ఎందుకవుతుంది. పిల్లల సంరక్షణ తల్లతండ్రులు బాధ్యత అయినప్పుడు వారి ఆలనా పాలనా చూసుకోవడం ఇద్దరి బాధ్యత.
ఇకప్పుడు తల్లే పిల్లలను చూసుకోవాలి, తండ్రి సంపాదించాలని ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, చరణ్ నా పిల్లలకు తినిపించేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, అది సర్వసాధారణమే అనిపిస్తుంది తప్ప గొప్పగా ఎందుకు ఫీలవ్వాలి అంటూ ఉపాసన పిల్లల విషయంలో తండ్రి బాధ్యతను గుర్తు చేసింది.
















































