విలన్ గా ట్రై చేస్తే బావుంటుంది!
It would be good to try playing a villain!
కన్నడ స్టార్ హీరో యశ్ రావణ్ గా ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటున్నారు. కన్నడలో కేజిఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 ద్వారా పాన్ ఇండియా ప్రేక్షకుల్లో బలమైన ఇంపాక్ట్ చూపించిన యశ్ టాక్సిక్ చిత్రంతో విపరీతమైన విమర్శలు మూటగట్టుకున్నారు. కానీ రామాయణ లో రావణ్ గా జననీరాజనాలు అందుకుంటున్నారు.
యష్ ని రావణ్ గా చూసినప్పటి నుంచి ఆయన అభిమానులే యశ్ ని విలన్ గా ట్రై చేయొచ్చుగా అంటూ రిక్వెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ అవుతుంది. టాక్సిక్ తో డిజప్పాయింట్ అయ్యి రామాయణ తో మళ్ళీ ప్రసంశలు అందుకుంటున్న యశ్ అటు నిర్మాతగాను రామాయణ తో మంచి లాభాలు అందుకోబోతున్నారు.
నటుడిగా ప్రసంశలు, నిర్మాతగా లాభాలు.. రామాయణతో రెండు విధాలుగా లాభపడినవారు కేవలం యశ్ ఒక్కరే. రాముడిగా రణబీర్ కి రాని పేరు యశ్ రావణ్ గా అందరి మనస్సులో గుడి కట్టించేసుకున్నారు. మరి యశ్ అటు విలన్ గాను ఇటు హీరోగానూ చేస్తే బావుంటుందేమో చూద్దాం.. అసలు యశ్ ఎలా ఆలోచిస్తారో అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
















































