ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Keeravani has shed 22 kilos and praised his determination

22 కేజీలు లాస్ తో షాక్ ఇచ్చిన‌ కీరవాణి

Keeravani has shed 22 kilos and praised his determinationKeeravani has shed 22 kilos and praised his determination

ఆస్కార్ విజేత.. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి  అద్భుతమైన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మ్యూజిక్ పరంగా కాకుండా తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఆశ్చర్యపరిచారు. ఏకంగా 22 కేజీల బరువు తగ్గి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్న కీరవాణిని చూసి అభిమానులు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌లో కీరవాణిని కలిసిన  బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్  ఆయన మేకోవర్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే కీరవాణితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న అనుపమ్ ఖేర్.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. `నా ప్రియమైన మిత్రుడు కీరవాణి గారు ఏకంగా 22 కేజీలు తగ్గి అద్భుతమైన పట్టుదలను ప్రదర్శించారు. ఆయన సంకల్పం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం` అంటూ కొనియాడారు.

ఈ మేకోవర్ వల్ల కీరవాణి ఎంతో ఎనర్జిటిక్‌గా.. ఉత్సాహంగా కనిపిస్తున్నారని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. నిటారుగా నడుస్తూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆయన్ని చూసి గర్వంగా అనిపించిందన్నారు. కాగా నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `రామాయణ`లో జటాయు పాత్రకు వాయిస్ ఓవర్ ఇస్తున్న అనుపమ్ ఖేర్, ఈ సందర్భంగా కీరవాణితో జరిగిన ఆత్మీయ భేటీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో అది  నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.

MM Keeravani has shed 22 kilos as part of a significant weight-loss transformation