ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nara Lokesh Visits MSME Pavilion at CII Partnership Summit 2026

ఇంటికో పారిశ్రామికవేత్త, ఏపీ లక్ష్యం: మంత్రి నారా లోకేష్

Nara Lokesh Visits MSME Pavilion at CII Partnership Summit 2026Nara Lokesh Visits MSME Pavilion at CII Partnership Summit 2026

 

విశాఖ వేదికగా ఎంతో వైభవంగా నిన్న గురువారం ప్రారంభమైన CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ రెండోరోజు కొనసాగుతుంది. సుమారు 58 నుండి 59 దేశాలకు చెందిన మంత్రులు, దౌత్యవేత్తలు, గ్లోబల్ సీఈఓలు, పారిశ్రామికవేత్తలు సహా 3,800 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. భారీ పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలు కంపెనీ CEO లతో సమావేశమయ్యారు.

నిన్న గురువారం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పొందిన అరకు కాఫీని ఆస్వాదించిన పీయూష్‌ గోయల్‌ అరకు కాఫీ టేస్ట్‌ అదరహో అంటూ కితాబునిచ్చారు. పక్కనే ఉన్న పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌ కూడా అరకు కాఫీ తయారీ వివరాలను గోయల్‌కు వివరించారు. మరోపక్క విశాఖ సీఐఐ సదస్సు వేదికగా పెట్టుబడుల ఆకర్షణకు మంత్రి నారా లోకేశ్​ చేస్తున్న ప్రయత్నాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు.

ఇక రెండోరోజు శుక్రవారం కేంద్రమంత్రి రామ్మూర్తి నాయుడు తో కలిసి మంత్రి నారా లోకేష్ ఏపీలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.  ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో 25 విభిన్న పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తూ, సంప్రదాయ పరిశ్రమల నుంచి అత్యాధునిక సాంకేతిక రంగాల వరకు పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఏపీలో లభ్యమయ్యే రేర్ ఎర్త్ మినరల్స్‌ను వినియోగించుకునే దిశగా బీచ్ శాండ్ నుంచి ఖనిజాల వెలికితీతకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. ప్రపంచస్థాయి విద్యాసంస్థల సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి, ప్రత్యేక విద్యా ప్రణాళికను రూపొందించనున్నట్లు వెల్లడించారు.

రతన్ టాటా దేశానికి అందించిన సేవలు, ఆయన పాటించిన నైతిక విలువలు, నిజాయతీ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయన పేరుతో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయడం వెనుక యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినివ్వాలన్న ఉద్దేశం ఉందన్నారు.

యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూమి కేటాయింపుతో పాటు ఎక్స్‌పోజర్ విజిట్స్, వెంచర్ క్యాపిటలిస్టులతో అనుసంధానం వంటి సదుపాయాలను కల్పిస్తామని ఈ సందర్భంగా నారా లోకేష్ హామీ ఇచ్చారు. 

Nara Lokesh