అఫీషియల్: 1000 కోట్ల బొమ్మ రామాయణ

Ramayana enters 1000 cr clubRamayana enters 1000 cr club


రామాయణ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్బులోకి అఫీషియల్ గా అడుగుపెట్టింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లు సీతారామ, రావణులుగా నటించిన ఈచిత్రాన్ని నితీష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దివాళి స్పెషల్ గా నవంబర్ 5 న విడుదలైన రామాయణ చిత్రం ఎనిమిది రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసారు.

ఇండియా నుంచి ఓవర్సీస్ వరకు రామాయణ బాక్సాఫీసు దగ్గర జాతరను తలపించింది. ఎన్నిసార్లు రామాయణ చూసినా కొత్త రామాయణ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఇంట్రెస్ట్ చూపించారో అనే దానికి నిదర్శనమే ఈ రూ.1000 కోట్ల పోస్టర్. ఈలెక్కన రామాయణ ఫైనల్ రన్ లో రూ.2000 కోట్లు తేవడం పక్కా అనిపిస్తుంది.

కేవలం పార్ట్ 1 కె ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే రామాయణ పార్ట్ పై ఎన్ని అంచనాలు ఉండాలి. ఎంత బడ్జెట్ పెట్టాలి.. ఇక 2027 దివాళి నుంచి రామాయణ పార్ట్ 2 ని పోస్ట్ పోన్ చేసి 2028 కి షిఫ్ట్ చేసినట్లుగా వార్తలు రావడమే కానీ.. మేకర్స్ మాత్రం ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. 

Rs 1,000 crore in 8 days: Ramayana delivers box-office