BB10: ఆ ఇద్దరిలో ఒకరు అవుట్
Bigg Boss Telugu 10 : Varshini and Neethu master in Danger Zone
బిగ్ బాస్ సీజన్ 10 లో ఈ వారం కెప్టెన్ వంశీ తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా నామినేషన్స్ లోకి వెళ్లినట్టుగా బిగ్ బాస్ ప్రకటించారు. అంతకుముందు నామినేషన్స్ లో నీతూ vs త్రిగుణ, ముఖేష్ vs సుధీర్, వర్షిణి vs సుధీర్ అన్నట్టుగా పెద్ద పెద్ద గొడవలు జరిగినా బిగ్ బాస్ అందరిని బుక్ చేసారు.
హౌస్ మేట్స్ మొత్తం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ వారం ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతారనే విషయంలో అందరిలో ఆసక్తి నడుస్తుంది. త్రిగుణ ఓటింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు, త్రిగుణ కి అటు ఇటుగా ముఖేష్ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ ఓట్స్ ముఖేష్ కి పడుతున్నాయి.
ఇక ఈ వారం బోటం లైన్ లో నీతూ మాస్టర్, వర్షిణి ఉన్నారు. నీతూ మాస్టర్ అటు ఆటపరంగాను, ఇటు మాట పరంగాను వర్షిణి మీద 100 రేట్లు బెటర్ అనే ఫీలింగ్ లో ఆడియన్స్ ఉన్నా ఆమెకు సరైన ఓటింగ్ బలం లేదు. ఇక వర్షిణి గత కొన్ని వారాలుగా సేవ్ అవుతూ వస్తుంది. ఆమె ఈ వారం తప్పకుండా ఎలిమినేషన్ లో వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
















































