కింగ్ సాంగ్ విషయంలో షారుక్ పట్టుదల!
Shah Rukh Khan Performs Tu Mil Jaaye From Kingబాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ `కింగ్`. ఈ చిత్రంలో షారుక్‌తో పాటు దీపికా పదుకొణె, సుహానా ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో క్ష ప్రత్యేకమైన సాంగ్ కోసం షారుక్ ఖాన్ ప్రెజెంటేషన్ విషయంలో పక్కాగా వ్యవహరించారని, తన వయసుకు తగినట్లుగానే కనిపించాలని షారుక్ కోరుకున్నట్లు కొరియోగ్రాఫర్స్ షాజియా సామ్జీ, పియూష్ భగత్ తాజాగా వెల్లడించారు.
సినిమాలోని `తు మిల్ జాయే` అనే పాటను కొరియోగ్రఫీ చేసిన ఈ జోడీ ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. పాటలో భాగంగా ఎడ్ షీరన్ రాప్ సాంగ్‌కు డెన్స్ స్టెప్స్ వేయాల్సి వచ్చినప్పుడు ఈ వయసులో తనకు ఏది సూట్ అవుతుందో షారుక్ చాలా స్పష్టంగా చెప్పారని తెలిపారు. `ఆయనకున్న ఆరాతో ఏదీ పడితే అది ఆయనకు ఇవ్వలేం. ఆయన వయసుకు తగినట్లుగా తనకంటూ ఉండే కూల్ స్టైల్‌లోనే కనిపించాలని షారుక్ సర్ పట్టుదలగా ఉండేవారు` అని కొరియోగ్రాఫర్స్ తెలిపారు.
ముఖ్యంగా రాప్ సాంగ్ వేగంగా ఉండటంతో దీన్ని ఎలా చేయగలనని షారుక్ మొదట్లో కాస్త సందేహించినా? చివరకు కారులో కూర్చుని ఆ సీక్వెన్స్ చేసేలా డిజైన్ చేయడంతో షూటింగ్ ఎంతో సాఫీగా సాగిందని గుర్తుచేసుకున్నారు. కేవలం స్టైల్ విషయంలోనే కాకుండా ప్రతి షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు రోజువారీ షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా షారుక్- దీపికా పదుకొణె రాత్రివేళల్లో ప్రత్యేకంగా రిహార్సల్స్ చేసేవారని ప్రశంసించారు.
















































