విశ్వంభర ట్రైలర్ రెడీ?
Vishwambhara has finally made progress
ఎక్కడో మరుగున పడిపోయిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఈమధ్యనే వార్తల్లో కనిపిస్తుంది. కారణం విశ్వంభర విడుదల తేదీ వచ్చే ఏడాది సంక్రాంతికి ఉండొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడం లేదు. దానితో మెగా అభిమానులతో పాటు ఇంకా కొన్ని సినిమాల నిర్మాతలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
విశ్వంభర సీజీ వర్క్ పూర్తి చేసేసి దర్శకుడు వశిష్ట సరైన డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి కి వస్తున్న చిరు మరో మూవీ కాక ని గనక వాయిదా వేస్తె ఆ డేట్ కి విశ్వంభర ను దించాలనేది వశిష్ట ప్లాన్. కానీ కాక దర్శకుడు ఒప్పుకోక పోవడంతో విశ్వంభర రిలీజ్ తేదీ డైలమాలో పడింది.
తాజాగా విశ్వంభర ట్రైలర్ ని రెడీ చెయ్యడమే కాదు.. ట్రైలర్ తో పాటుగా విశ్వంభర విడుదల తేదీని మేకర్స్ రెడీ చేశారనే టాక్ వినబడుతుంది. ఏ టైమ్ లో అయినా విశ్వంభర రిలీజ్ తేదీ అరైవింగ్ అంటూ వినిపిస్తున్న న్యూస్ తో మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఆ తేదీ సంక్రాంతికి ఉంటుందా, లేదంటే డిసెంబర్ లో ఉంటుందా అనేది ప్రస్తుతము అందరిలో క్యూరియాసిటీ నడుస్తుంది.
















































