ఇట్లు అర్జున ప్రీమియర్స్ టాక్
Itlu Arjuna Premier Talk
కొత్త కుర్రాడు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు అంటే ఆడియన్స్ లో అంతగా ఆసక్తి కనిపించదు. ఏ సినీ వారసుడో అయితే ఆడియన్స్ లో విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అనీష్ అనే కుర్రాడు ఇండస్ట్రీకి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు అంటే అందరి చూపు ఆ కుర్రాడి పైనే. ఏ బ్యాక్ రౌండ్ ఉంది అనీష్ వెనుక అనే ఆసక్తిని క్రియేట్ చేయడంలో ఈ కొత్త కుర్రాడు సక్సెస్ అయ్యాడు.
కింగ్ నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరణ్, అఖిల్ అనీష్ వెనుక నిలవడమే అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. అనీష్ డెబ్యూ మూవీ ఇట్లు అర్జున. నేడు నవంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి డేట్ అంటూ పలుమార్లు వాయిదా పడి భారీ హైప్ తో నేడు విడుదలైన ఇట్లు అర్జున్ ప్రీమియర్స్ తో నుంచే సందడి చేసింది.
ఇట్లు అర్జున్ ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే...
డెబ్యూ మూవీ తోనే అనీష్ పెద్ద సాహసమే చేసాడు. మూగ వాడిగా అనీష్ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. పదిహేను నిమిషాల్లోనే కొత్త కుర్రాడు ఫైట్స్ & డాన్స్ బాగా చేస్తాడు అని చూపించేశారు.. సినిమాలో కామెడీ హైలైట్, వెన్నెల కిషోర్, రఘుబాబు, బ్రహ్మాజీ కామెడీ ఆకట్టుకుంటుంది .హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ చక్కగా కుదిరింది, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.
హీరోయిన్ అనస్వర రాజన్ అందంగా కనిపించడమే కాకుండా, అక్కడక్కడా తన కామెడీతోనూ ఆకట్టుకుంది, టెక్నీకల్ గా సినిమా చాలా బావుంది. తమన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు సినిమాకు ప్లస్. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, ఇట్లు అర్జున యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు అంటూ ప్రీమియర్స్ చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు.
మరి ఇట్లు అర్జున్ ఎలా ఉంది అనేది ఫుల్ రివ్యూ మరికాసేపట్లో..
















































