BB10-రోహిత్ రీ ఎంట్రీ అన్నారు.. ఎక్కడా?

Bigg Boss Telugu 10-Rohit Re-EntryBigg Boss Telugu 10-Rohit Re-Entry


బిగ్ బాస్ సీజన్ 10 లో ఆడియన్స్ లో అదిరిపోయే ఇంపాక్ట్ క్రియేట్ చేసి సీజన్ మధ్యలోనే హౌస్ మేట్స్ చేతిలో ఎలిమినేట్ అయిన రోహిత్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యాడో అందరూ చూసారు. రోహిత్ ఎలిమినేషన్ లీక్స్ బయటకు రాగానే రోహిత్ అభిమానులు, పీఆర్ టీమ్ అంతా నానా హడావిడి చేసింది.

రోహిత్ ఎలిమినేషన్ అన్యాయం అంటూ బిజి బాస్ రివ్యూయర్స్ అంతా సోషల్ మీడియాలో గొంతు చించుకున్నారు. రోహిత్ ని సీక్రెట్ రూమ్ కి వెళ్ళమని హోస్ట్ బ్రతిమాలారు, కానీ ఒప్పుకోలేదు, ఆయన తల్లిని పిలిపించారు, అయినా ఒప్పుకోలేదు అంటూ ఏవేవో కథలు అల్లి సోషల్ మీడియా లో స్ప్రెడ్ చేసారు.

ఆతర్వాత రోహిత్ రీ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా రోహిత్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ హంగామా స్టార్ట్ చేసారు. రివ్యూయర్స్ కూడా ముఖేష్ గనక సైలెంట్ అయితే రోహిత్ ని బిగ్ బాస్ యాజమాన్యం రీ ఎంట్రీ ఇప్పించే అవకాశం ఉంది అన్నారు.

ఈ వారం ఫ్యామిలీ వీక్ మొదలయ్యింది. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరో నాలుగు వారాల్లో బిగ్ బాస్ ముగుస్తుంది. ఇలాంటి సమయంలో రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చి ఏం చేస్తాడు అంటూ కామన్ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.

Bigg Boss Telugu 10