వారణాసి కథపై వైరల్ అవుతున్న థియరీ!

Varanasi Movie UpdateVaranasi Movie Update

రాజమౌళి-  మహేష్  కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అడ్వెంచరస్ ఎపిక్ `వారణాసి` చిత్రంపై రోజుకో ఆసక్తికరమైన ఊహాగానం వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన  సంచలన థియరీ నెటిజన్లను  ఆకట్టుకుంటోంది. రామాయణంలో  శక్తివంతమైన రాక్షస వీరుడైన కుంభకర్ణుడి పాత్రను ఈ చిత్రంలోని విలన్ క్యారెక్టర్‌తో కనెక్ట్ చేస్తూ జక్కన్న  భారీ పౌరాణిక ఫాంటసీకి శ్రీకారం చుట్టారని ప్రచారం జోరుగా సాగుతోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న `కుంభ` అనే శక్తివంతమైన పాత్రను త్రేతాయుగంలోని కుంభకర్ణుడి పునర్జన్మ లేదా అతని ఆత్మ ప్రతిరూపంగా డిజైన్ చేశారని ప్రచారం జరుగుతోంది. రామ-రావణ యుద్ధ సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో చెల్లాచెదరైన దివ్యమైన శక్తులు ..రత్నాలను సేకరించి, అపరిమితమైన శక్తిని పొందాలనే కుంభకర్ణుడి ప్రతీకార యత్నమే ఈ చిత్రానికి మూలకథ అని విశ్లేషిస్తున్నారు. ఈ రాక్షస కుట్రను అడ్డుకోవడానికి వర్మ్‌హోల్.. టైమ్ ట్రావెల్ ద్వారా కథానాయకుడు త్రేతాయుగానికి ప్రయాణించి ఆ యుద్ధ ఘట్టంతో ముడిపడేలా సీన్లు ఉంటాయనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ట్రెండ్ అవుతోంది.

అయితే రాజమౌళి మార్క్ సినిమాల్లో పౌరాణిక అంశాలకు, రివేంజ్ డ్రామాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. `మగధీర`లో పునర్జన్మలు, `ఈగ`లో ఆత్మ ప్రతీకారం, `ఆర్ఆర్ఆర్లో` చారిత్రక నవలల కల్పనను అద్భుతంగా చూపించిన జక్కన్న.. ఈసారి మోడర్న్ టైమ్ ట్రావెల్‌ను రామాయణ నేపథ్యంతో కలగలిపి సరికొత్త విజువల్ వండర్‌గా అందించబోతున్నారని ఫ్యాన్స్ బ‌లంగా న‌మ్ముతున్నారు.  ప్రస్తుతం ఈ లీక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే  ఇది అభిమానుల ఊహాగానమా లేక నిజంగానే జక్కన్న స్క్రిప్ట్ మ్యాజిక్ ఆ రేంజ్‌లో ఉందా అనేది తెలియాలంటే అధికారిక అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Varanasi Movie