బిగ్ బాస్ 10: హౌస్ లో శివ్ - ప్రియాంక ఎంగేజ్మెంట్
Bigg Boss 10: Shiv and Priyanka get engaged inside the house
బిగ్ బాస్ సీజన్ 10 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఫ్యామిలీ మెంబెర్స్ ని చూసి కంటెస్టెంట్స్ కన్నీళ్లు, వారితో పాటుగా పక్కన ఉన్నవారి ఎమోషన్స్ తో హౌస్ మొత్తం తడిచి ముద్దవుతుంది. ఇప్పటికే నరేష్ బ్రదర్, శ్వేతా ఫ్యామిలీ, టెంపర్ వంశి భార్య, ఆయన కూతురు హౌస్ లోకి వచ్చి వెళ్లారు.
ఈరోజు ఎపిసోడ్ లో ముఖేష్ తల్లి హౌస్ లోకి వచ్చారు. తన సిస్టర్ వీడియో మెసేజ్ విన్నారు ముఖేష్ ఇంకా హౌస్ మేట్స్. ఇక వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన శివ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక జైన్ హౌస్ లోకి అడుగుపెట్టింది. రాగానే శివ్ నువ్ డ్రెస్ మార్చుకో అంటూ డ్రెస్ ఇచ్చింది. వేసుకుని రాగానే హౌస్ మేట్స్ మధ్యన వారు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
శివ్ - ప్రియాంక జైన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారు. కలిసే ఉంటున్నారు. కానీ ఎంగేజ్మెంట్, పెళ్లి మాత్రం చేసుకోలేదు. మరి బిగ్ బాస్ హౌస్ లోకి ఆల్రెడీ వెళ్లొచ్చిన ప్రియాంక ఇప్పుడు హౌస్ లో ప్రేమికుడు శివ్ ని ఎంగేజ్మెంట్ చేసుకుంది. శివ్ ప్రపోజ్ చేసి ప్రియాంక చేతికి ఉంగరం తొడిగాడు.
హౌస్ మేట్స్ ప్రియాంక ను ఎత్తుకుని ఆమె చేతిలోని దండను శివ్ మెడలో వేసాడు. తర్వాత శివ్ కూడా ప్రియాంక మెడలో దండ వేసాడు. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ గా మారింది.















































