ఫ్యామిలీ ఎమోషన్స్ తో తడిచిపోతున్న BB హౌస్
Bigg Boss house is filled with happiness and emotional moments
బిగ్ బాస్ సీజన్ 10 లో పదో వారం హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ని కలుస్తున్నారు. నిన్నటివరకు గొడవలు పడి కెప్టెన్సీ టాస్క్ లు గెలిచి కొట్టుకున్న కంటెస్టెంట్స్ ఇప్పుడు ఫ్యామిలీస్ ని కలుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గొడవలు వదిలి ప్రేమగా కనిపిస్తున్నారు. స్కూల్ టాస్క్ పెట్టి మధ్యలో ఫ్యామిలీ మెంబెర్స్ ని హౌస్ లోకి పంపిస్తున్నాడు బిగ్ బాస్.
నరేష్ బ్రదర్ అలాగే, శ్వేతా తండ్రి.. ఆమె సిస్టర్, టెంపర్ వంశి భార్య పాప ఇప్పటివరకు హౌస్ లోకి వచ్చారు. శ్వేతా ఫాదర్ ని చూసి ఆమె ఎమోషనల్ అవ్వగా అది చూసి వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది. టెంపర్ వంశి తన పాప ని చూసి ఎమోషనల్ అవుతూ ఏడ్చేయ్యగా.. అది చూసి త్రిగుణ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఈరోజు ముఖేష్ ఫ్యామిలీ లో ఆయన తల్లి, అమన్ తండ్రి, శివ్ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక హౌస్ లోకి రాబోతున్నారు. మరి ఎవ్వరి ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చినా త్రిగుణ వాళ్లకు కాఫి, టీ ఇస్తూ ప్రేమతో మట్లాడడం ఆడియన్స్ కి బాగా నచ్చేస్తుంది. వచ్చిన ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం త్రిగుణ నువ్వు తోపు, నువ్వు గేమ్ చెంజర్ వి అంటూ అతన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.















































