AA 23 టైటిల్ అదేనా?

Is this AA23 title Is this AA23 title


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాక మూవీ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతము ముంబై లో జరుగుతుంది. ప్రెజెంట్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోనే ఉన్నారు. దీపావళి ఫెస్టివల్ కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. అయితే రాక దుబాయ్ షెడ్యూల్ ని అక్కడ క్యాన్సిల్ చేసి అది హైదరాబాద్ లోనే భారీ సెట్ వేసి ఫినిష్ చెయ్యాలని అట్లీ డిసైడ్ అయ్యారట.

ఇక అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కూడా మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తోనే ప్రకటించారు. AA 23 అంటూ ఈ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టారు. దర్శకుడిగా కూలి తో డిజప్పాయింట్ చేసిన లోకేష్ కనగరాజ్ డీసీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అదే ఊపులో అల్లు అర్జున్ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నారు.

ఈ మూవీలో అల్లు అర్జున్ మేకోవ‌ర్‌, లుక్ కొత్త‌గా ఉంటాయ‌ని, ఈ మూవీ గ్యాంగ్‌ స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లుగా స‌మాచారం, అదీకాక ఈ సినిమాకు గ్యాంగ్‌ స్ట‌ర్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌ ను సైతం ఖ‌రారు చేసిన‌ట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఐకాన్ స్టర్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారేమో చూడాలి. 

Allu Arjun turning Gangster