BB10: త్రిగుణ్ ని పొగుడుతుంటే.. ముఖేష్ కి పిచ్చెక్కేస్తుంది
Bigg Boss 10: Families appreciate Trigun
బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లో త్రిగుణ్ అనేవాడు లేకపోతె బుల్లితెర ఆడియన్స్ ఎప్పుడో బిగ్ బాస్ ని చూడడం మానేసేవారు. త్రిగుణ్ 24/7 గేమర్. మానిప్యులేటర్, అబద్దాల కోరు, కానీ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాడు. అందరితో క్లోజ్ గా ఉంటాడు, గిల్లి గొడవలు పెట్టుకుంటాడు. త్రిగుణ్ జపం చేస్తూ పొటన్షియల్ ప్లేయర్ అనుకున్న రోహిత్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు.
ఇక ముఖేష్ గేమర్ కాదనలేం, కానీ మాట తీరులో త్రిగుణ్ ని కొట్టేవాడు లేడు. అదే ఫ్యామిలీ వీక్ లో ఎవరి ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చినా త్రిగుణ్ నువ్వు గేమర్, నువ్వు సూపర్ అంటూ పోగుడుతున్నారు. అది చూసి ముఖేష్ కి పిచ్చెక్కిపోతుంది. నేను గేమర్, ఇది గేమా, ఇది ఆటా అంటూ రామకృష్ణ దగ్గరకు వెళ్లి అన్నిటి లో దూరి గొడవ పెట్టుకునేవాడు గేమర్ ఎలా అవుతాడు.
అందరితో గొడవలు పడతాడు, ఆయనెలా గేమర్ అవుతాడు అంటూ ముఖేష్ రకరకాల చేష్టలతో చెబుతున్న వీడియో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ముఖేష్ రామకృష్ణ దగ్గర మాట్లాడుతున్నప్పుడు త్రిగుణ్ రాంప్రసాద్ వాళ్లతో కూర్చుని నన్ను ఫ్యామిలీ వీక్ లో ముగ్గురు పొగిడేసరికి మనోడికి పిచ్చెక్కిపోయింది. మెంటల్ లా బిహేవ్ చేస్తున్నాడు, కెమెరాలతో, రామకృష్ణ దగ్గర మాట్లాడుతున్నాడు అంటూ దేబ్జానీ, వంశి, రాంప్రసాద్, త్రిగుణ చెప్పుకుంటున్నారు.
నిజంగానే ముఖేష్ అలానే బిహేవ్ చేసాడు, అందరూ త్రిగుణ్ ని పోగుతుంటే ముఖేష్ తట్టుకోలేకపోతున్నాడు.















































