విడాకుల ప్రకటనకు ముందే HYD ని వదిలిన అన్నా
Anna Left Hyderabad for a Foreign Country Before Divorce
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా తో విడిపోయినట్లుగా ప్రకటించారు. 13 ఏళ్ళ వైవాహిక జీవితానికి పవన్ కళ్యాణ్-అన్నా స్వస్తి పలికారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి రెండుసార్లు విడాకులయ్యాయి. మొదటి భార్య నందిని, రెండో భార్య రేణు దేశాయ్ తో విడాకులు తీసుకుని అన్నా ని వివాహమాడిన పవన్ ఇప్పుడు ఆమెకు కూడా విడకులిచ్చారు.
అయితే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయన భార్య గా అన్నా పవన్ పక్కనే ఉన్నారు. 2024 విక్టరీని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆతర్వాత డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి మొన్న ఆగష్టు 15 జెండా వందనం వరకు అన్ని అధికారికకార్యక్రమాల్లో అన్నా పాల్గొన్నారు.
అంతేకాదు ముంబై లో పవన్ భుజానికి సర్జరీ సమయంలోను భార్యగా అన్నా వెన్నంటే ఉన్నారు. కొద్దిరోజులుగా అన్నా పవన్ తో కనిపించడం లేదు. కేరళ ఆయుర్వేద వైద్యానికి పవన్ కళ్యాణ్ ఒంటరిగానే వెళ్లారు, అలాగే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక అన్నా చాలా యాక్టీవ్ గా ఉండేవారు.
కానీ దసరా ముందు నుంచి అన్నా ఇన్స్టా ని డీ యాక్టీవ్ చేసారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, అన్నా విడిపోతున్నామని ప్రకటించకముందే ఆమె హైదరాబాద్ ని వీడి విదేశాలకు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. పవన్ తో తెగ తెంపులు చేసుకుని అన్నా హైదరాబాద్ నుంచి తన పుట్టింటికి వెళ్ళిపోయినట్లుగా చెబుతున్నారు.
















































