అర్జున వెనుక ఇంత పెద్ద స్ట్రాటజీనా?

Ram Charan at Itlu Arjuna eventRam Charan at Itlu Arjuna event


ఇట్లు అర్జున్. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న చిన్న సినిమా. హీరో అనీష్, హీరోయిన్ అనశ్వర రాజన్. దీనిని అక్కినేని నాగార్జున ప్రెజెంట్ చేస్తున్నారు. ఇంతే.. ఇంతకుమించి ఇందులో స్పెషల్ ఏముంది. అనీష్ ఎవరో కూడా ఆడియన్స్ కి తెలియదు. నాగార్జున ఈ సినిమా వెనుక ఉన్నారు అంటే.. కాస్త క్రేజ్ వస్తుంది.

కానీ ఇట్లు అర్జున కోసం ప్రేక్షకులు ఎందుకు ఎదురు చూస్తున్నారు, ఈ సినిమా విడుదల వాయిదా పడినప్పుడల్లా అంతగా డిజప్పాయింట్ ఎందుకయ్యారు అనేది ఎవరికి అర్ధం కానీ ప్రశ్న. ఇప్పుడు ఈ చిన్న హీరో, డెబ్యూ హీరో వెనుక క్రేజీ స్టార్స్ నిలబడ్డారు. ఇప్పటికే ఇట్లు అర్జున హీరో అనీష్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ..

ఇట్లు అర్జున్ మ్యూజిక్ కాన్సెర్ట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్, నాగార్జున రావడం.. ఇదంతా చూసాక ఓ చిన్న, డెబ్యూ హీరో వెనుక టాలీవుడ్ స్టార్స్.. ఇంత పెద్ద స్ట్రాటజీ ఏ సినీవారసుడికి కూడా లేదు. కానీ అనీష్ కి ఎందుకింత క్రేజ్, ఆయన వెనుక ఇంత పెద్ద స్టార్స్ ఉండడమేమిటి అనేది అర్ధం కాక ప్రేక్షకులు అయోమయపడుతున్నారు.

మరో పక్క ఎన్టీఆర్, రామ్ చరణ్, అఖిల్ లాంటి స్టార్స్ అర్జున కోసం నిలబడ్డారు అంటే.. ఈ సినిమా ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే ఇలా.. ఓసారి వీక్షిస్తే పోలా అనే ఆసక్తిని ఆడియన్స్ ప్రదర్శిస్తున్నారు.

Jr NTR supports debut actor Aniesh's Itlu Arjuna