ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> OTT Deal Puts Vishwambhara Makers Under Pressure

విశ్వంభర మేకర్స్‌కు జనవరి 13 సవాల్!

OTT Deal Puts Vishwambhara Makers Under PressureOTT Deal Puts Vishwambhara Makers Under Pressure

 

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర` విడుదల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో చేసుకున్న ఓటీటీ ఒప్పందంలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 13 లోపే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలనే నిబంధన డెడ్‌లైన్‌లా మారడంతో మేకర్స్‌పై ఒత్తిడి నెలకొంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు గ్రాఫిక్స్ పనుల్లో నాణ్యత తగ్గకుండా చూస్తూనే, నిర్ణీత సమయానికి థియేట్రికల్ రిలీజ్ పూర్తి చేయడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.

గతంలో విడుదల చేసిన ఒక్క టీజర్ మినహా విశ్వంభర ప్రమోషన్ల హోరు ఇంకా పూర్తిస్థాయిలో అందుకోలేదు. అయితే సినిమాపై అంచనాలను పెంచేందుకు యూనిట్ డిసెంబర్‌లో ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ పాటతో ప్రమోషన్ల స్పీడ్ పెంచి, నెమ్మదిగా పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఆలస్యం కావడం , మార్కెట్ సమీకరణాలు మారడం వల్ల విడుదల తేదీపై మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. జనవరి 13 డెడ్‌లైన్ సవాలును అధిగమించి, అనుకున్న సమయానికి విజువల్ వండర్‌గా సినిమాను ప్రేక్షకు ముందుకు ఎలా తీసుకొస్తారనేది  టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

Vishwambhara Faces January 13 OTT Deadline Pressure