అనిరుద్-కావ్య వెడ్డింగ్: గ్రీస్ కి పయనమైన సెలబ్రిటీస్
Rajinikanth and his family are travelling to Greece
కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర-కావ్య మారన్ ల వివాహం రేపు నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్ వేదికగా జరగబోతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ గా గ్రీస్ లో జరగబోయే అనిరుద్ వివాహానికి కోలీవుడ్ సెలబ్రిటీస్ గ్రీస్ పయనమయ్యారు. అందులో ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యామిలీతో గ్రీస్ వెళుతున్నారు.
సూపర్ స్టార్, ఆయన భార్య లతకు మేనల్లుడు అయిన అనిరుద్ వివాహానికి ఆయన ఫ్యామిలీతో కలిసి గ్రీస్ వెళుతున్నారు. అలాగే ఉదయనిధి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంకా పలువురు సెలబ్రిటీస్ ఈ వివాహం కోసం గ్రీస్ బయలుదేరారు. గ్రీస్ లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల నడుమ ఈ వివాహం గ్రాండ్ గా జరగబోతుంది.
అక్కడ గ్రీస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ పూర్తయ్యాక కొద్ధి రోజుల గ్యాప్ తో అంటే నవంబర్ 21న చెన్నైలో అనిరుద్-కావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ కి కళానిధి మారన్ అంగరంగ వైభవంగా ప్లాన్ చెయ్యడమే కాదు ఇందుకుగాను ప్రముఖ రాజకీయనాయకులను, అలాగే సినీ సెలబ్రిటీస్ ని ఆహ్వానించారు కూడా.
















































