శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: చంద్రబాబు
CM Chandrababu Press Meet on ZPTC and MPTC Election Results
ఏపీలో రీసెంట్ గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం విజయ దుందుభి మోగించి.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది. మేయర్, జడ్పిటిసి, ఎంపీటీసీ ఇలా ఏ ఎన్నికల్లో అయినా కూటమి ప్రభుత్వానిదే పై చెయ్యి అయ్యింది. ఈ ఎన్నికల్లో రచ్చ చేసి కూటమిని బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేసి గెలుద్దామని కలలు కన్న జగన్ కు ఆయన పార్టీ నేతలకు ఏపీ ప్రజలే యునానమస్ గా చుక్కలు చూపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. అన్నటికన్నా, అందరి కన్నా నారా లోకేష్ ఈ ఎన్నికల్లో కూటమికి విజయాన్ని అందించేందుకు రాత్రిబవళ్ళు పని చేసారు. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయాలను అందుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. స్థానిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు మరింతగా తిరస్కరించారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పల్నాడు, ప.గో., విశాఖ జిల్లాల్లో వైసీపీకి ప్రజా మద్దతే రాలేదు. కేడర్ బలంగా ఉన్న పార్టీ టీడీపీ.. సేవాభావమే టీడీపీ చేసే రాజకీయం. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలు జై కొట్టారు, జడ్పీటీసీల్లో 28 జిల్లాలకు గాను 27 జిల్లాల్లో కూటమికే ప్రజలు పట్టం కట్టారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా.. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కూటమికి బాసటగా నిలిచాయి.
ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా చూసుకున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు మమ్మల్ని చూసుకున్నారు. కూటమిని ఆశీర్వదించిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ఇది బ్యాలెట్ ఇచ్చిన విజయం.. ఇప్పటికైనా ఆరోపణలు మానుకోవాలి. అభివృద్ధికి ఆమోదం.. సుపరిపాలనకు గౌరవం ఈ ఎన్నికల ఫలితాలు. ఎన్నికల్లో ఉన్నా కూడా తుపాను సహాయక చర్యలు చేపట్టాం. రాయలసీమను రతనాలసీమగా మారుస్తున్నాం..
స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి గొడ్డలి పార్టీ కోర్టుల్లో కేసులు వేసింది. బీసీలకు రిజర్వేషన్లు రాకుండా సుప్రీంకోర్టులో కేసు వేసి గొడ్డలి పార్టీ అడ్డుపడింది. పలుచోట్ల ఎన్నికల జరిగే ప్రాంతాల్లో గొడ్డలి పార్టీ నేతలు అరాచకాలు సృష్టించారు.. అయినపప్టికి ఎన్నికలు సజావుగా సాగాయి. కూటమి గెలిచింది.. అంటూ చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.
















































