ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Deverakonda, Rashmika share Diwali moments from Japan

దివాళీ ని జపాన్ లో సెలెబ్రేట్ చేసుకున్న జంట

Vijay Deverakonda, Rashmika share Diwali moments from JapanVijay Deverakonda, Rashmika share Diwali moments from Japan


టాలీవుడ్ స్టార్స్ చాలామంది ఈ ఏడాది దీపావళిని ఫ్యామిలీతో సెలెబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ తన కుటుంబం అంటే అల్లు ఫ్యామిలీతో కలిసి దివాళి ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే టాలీవుడ్ సెలెబ్రిటీ జంట విజయ్ దేవరకొండ-రష్మిక లు తమ ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లారు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుండి ఈ జంట జపాన్ వెళ్ళింది.

విజయ్ దేవరకొండ తల్లి, తండ్రి, తమ్ముడు ఆనంద్ తో కలిసి భార్య రశ్మికను తీసుకుని విజయ్ దేవరకొండ జపాన్ వెళ్లారు. అక్కడే దివాళీ ని సెలెబ్రేట్ చేసుకోవడమే కాకూండా.. జపాన్ లో ఫుల్ గా ఛిల్ అవుతున్న ఫొటోస్ ను దీపావళి రోజు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

పండగ రోజు ఫ్యామిలీతో కలిసి రష్మిక ఎంజాయ్ చేస్తూ కనిపించింది. గతంలోనూ అంటే పెళ్ళికి ముందు కూడా రష్మిక ఇలాంటి ఫెస్టివల్స్ ని విజయ్ ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నప్పటికీ ఆ విషయాన్ని చాలా సీక్రెట్ గా మైంటైన్ చేసింది. కానీ ఈ ఏడాది పెళ్లి తర్వాత తొలి దీపావళిని రష్మిక అత్తింటి ఫ్యామిలీతో అఫీషియల్ గా సెలెబ్రేట్ చేసుకుంది.

Vijay Deverakonda and Rashmika Mandanna celebrated Diwali together in Japan