ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss capitalized well on the Rohit episode

బిగ్ బాస్ రోహిత్ ఎపిసోడ్ ని బాగా క్యాష్ చేసుకుంది

Bigg Boss capitalized well on the Rohit episodeBigg Boss capitalized well on the Rohit episode


బిగ్ బాస్ ని ఎవరూ చూడడం లేదు అంటున్నారు కానీ.. ఈ సీజన్ లో రోహిత్ వల్ల బిగ్ బాస్ గ్రాఫ్ పెరిగింది అనే చెప్పాలి. అగ్నిపరీక్ష తో బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన రోహిత నాయుడు ఫ్యాన్స్ బిగ్ బాస్ ని వీక్షించేలా చేసారు, రోహిత్ విషయంలో త్రిగుణ చేసే తప్పులను క్లిప్ టు క్లిప్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనాల్లో బిగ్ బాస్ పై ఆసక్తిని రేకెత్తించారు.

అయితే రోహిత్ సడన్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. రోహిత్ ఎలిమినేషన్ న్యూస్ లీక్ అవడమే తరువాయి అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ కారణముగా సండే ఎపిసోడ్ కోసం చాలామంది ఆడియన్స్ వెయిట్ చేసారు. రోహిత్ ఎలిమినేట్ అవడం, అతనికి ప్రోమో లేకపోవడం, బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ అన్నిటికి బిగ్ బాస్ యాజమాన్యానికి బాగానే వర్కౌట్ అయ్యింది.

ఇప్పుడు కూడా రోహిత్ ఎపిసోడ్ అంటే రోహిత్ ని మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పించాలని సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ ఎంతగా రెచ్చిపోతున్నారో చూస్తున్నాం. ఒకవేళ బిగ్ బాస్ యాజమాన్యం అభిమానుల డిమాండ్ ని కన్సిడర్ చేసి రోహిత్ ని తీసుకొస్తే గనక ఊహించని రెస్పాన్స్ బిగ్ బాస్ పై రావడం పక్కా అంటూ బిగ్ బాస్ రివ్యూయర్స్ అభిప్రాయపడుతున్నారు.

మరి ఈ వీకెండ్ లో గనక రోహిత్ ని రీ ఎంట్రీ కోసం తీసుకుంటే అటు రోహిత్ ఫ్యాన్స్ గెలిచినట్లే. అసలు ఇదంతా ఎందుకు షాలిని ని డైరెక్ట్ ఎలిమినేట్ చేసి రోహిత్ ని సీక్రెట్ రూమ్ లో పెట్టాల్సింది అనే మాట రోహిత్ అభిమానుల నోటా వినిపిస్తుంది.  

Bigg Boss Telugu 10