జైలర్ 3 కోసం నెల్సన్‌కు పూర్తి ఫ్రీహ్యాండ్
Full creative freedam to Nelson on Jailer 3కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `జైలర్` సిరీస్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ సక్సెస్ ఇచ్చిన జోరుతో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా `జైలర్ 3` ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మూడో భాగానికి సంబంధించి నెల్సన్ దిలీప్ కుమార్‌కు ప్రొడక్షన్ హౌస్ నుండి పూర్తి స్థాయి స్వేచ్ఛ లభించింది.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఉండే కమర్షియల్ హద్దులు, ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. అయితే నెల్సన్ తనదైన శైలి డార్క్ హ్యూమర్, ఎలివేషన్ సీన్స్, పాత్రల ఎంపికలో ఏమాత్రం రాజీపడకుండా మేకింగ్ చేశారు. `జైలర్ 3` విషయంలోనూ ఎలాంటి బయటి జోక్యం లేకుండా తన ఊహలకు పదును పెట్టి కథను సిద్ధం చేయడానికి రజనీకాంత్ -నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఆయనకు పూర్తిగా ఫ్రీహ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఫ్రీహ్యాండ్ కథా చర్చలకే పరిమితం కాదు. కాస్టింగ్ , పాన్-ఇండియా స్థాయిలో నటీనటుల ఎంపికలో కూడా కనిపిస్తోందని తెలుస్తోంది. మొదటి రెండు భాగాల సక్సెస్ ఇచ్చిన ధీమాతో మూడో భాగంలో నెల్సన్ మరింత వైవిధ్యమైన పాత్రలను, హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్‌ను ప్లాన్ చేస్తున్నారట. రజనీకాంత్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటూనే తనదైన సిగ్నేచర్ ట్రేడ్ మార్క్ కామెడీని సీరియస్ క్రైమ్ డ్రామాను బ్యాలెన్స్ చేసే పూర్తి స్వేచ్ఛ నెల్సన్ చేతిలో ఉంది.
















































