అక్కడ అలా తిరుగుతారు-ఇక్కడ విమర్శస్తారు
From South Breaks to Bollywood Headlines
బాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో మితిమీరిన అందాలు ఆరబొయ్యడమే కాదు.. పర్సనల్ గా అంటే వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు బికిని షో చేస్తూ ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. అంతేకాదు అవార్డు ఫంక్షన్ అయినా, ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ అయినా ఏదైనా అందాలు చూపించనిదే నిద్రపోరు.
బాలీవుడ్ భామలు సోషల్ మీడియా పిక్స్ కూడా అంతే గ్లామర్ షో తో కనిపిస్తాయి. మరి అక్కడ అంతలా విప్పుకుని తిరిగే ఆ భామలు సౌత్ కి వచ్చేసరికి మాత్రం తెగ విమర్శిస్తారు. ఆ కేరెక్టర్ ఒప్పకుని సినిమా చేసాక ఆ గ్లామర్ షో గురించి కేరెక్టర్స్ గురించి తెగ విమర్శిస్తారు. వాళ్ళనెవరు బలవంతం చెయ్యరు, గ్లామర్ షో చెయ్యమని ఇష్టపడితేనే చేస్తారు.
కానీ ఏదో బలవంతంగా కేరెక్టర్స్ ఒప్పుకుని, గ్లామర్ చూపిస్తున్నట్టుగా బిల్డబ్ ఇస్తూ మాట్లాడం చూస్తే ప్రేక్షకులకు ఒళ్ళుమండుతుంది. బాలీవుడ్ భామలు సౌత్ ని చిన్న చూపు చూస్తారు అనడానికి ప్రత్యేక ఉదాహరణ రాధికా ఆప్టే నే. ఆమెకు సరైన సినిమాలు లేవు కానీ.. ఇలాంటి విమర్శలతో హైలెట్ అవుదామనుకుంటుంది.. అందుకే సోషల్ మీడియాలో విమర్శలపాలవుతుంది.















































