ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sreeleela Joins Rajinikanth in Dharman

ధర్మన్ లో శ్రీలీల కేరెక్టర్ అదే !

Sreeleela Joins Rajinikanth in DharmanSreeleela Joins Rajinikanth in Dharman

 

సూపర్ స్టార్ రజినీకాంత్ మెయిన్ లీడ్ లో దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ధర్మన్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. జైలర్ 2 బ్లాక్ బస్టర్ అవడంతో ధర్మన్ పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో రామ్ పోతినేని నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నారు.

అయితే నటి శ్రీలీల ధర్మన్ చిత్రంలో నటిస్తుంది అనే న్యూస్ తప్ప మరే ఇతర వివరాలు తెలియవు. మైసూర్ షెడ్యూల్ లో శ్రీలీల పిక్స్ లీకైనా ధర్మన్ టీమ్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఈరోజు శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా ధర్మన్ లో ఆమె ఒక లవ్లీ రోల్ లో కనిపిస్తున్నట్టుగా వీడియో గ్లింప్స్ వదిలారు.

మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ లో శ్రీలీల వీడియో కట్ ఆమె అభిమానులను బాగా ఇంప్రెస్స్ చేసింది. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా నటిస్తుంది. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Sreeleela joins Rajinikanth's Dharman with Anirudh