ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10: So much negativity on Thrigun

BB10: బాబోయ్ త్రిగుణ్ కి ఎవరైనా చెప్పండయ్యా..!

Bigg Boss Telugu 10: So much negativity on ThrigunBigg Boss Telugu 10: So much negativity on Thrigun


బిగ్ బాస్ సీజన్ 10: త్రిగుణ్ లేకపోతె ఈ సీజన్ ని ఆడియన్స్ ఎవరూ చూసి ఉండేవారు కాదేమో. అది నిజమే. రోహిత్ తో ప్రతి నిమిషం తగవు పెట్టుకున్న త్రిగుణ్ ఎదుటివాళ్లను ట్రిగ్గర్ చెయ్యడమే కాదు, తాను కూడా చాలా త్వరగా ట్రిగ్గర్ అయ్యి మాటలు వదిలేస్తాడు. హోస్ట్ నుంచి ఒక ఎల్లో కార్డ్, ఒకసారి బేడీలు తెచ్చుకున్నాడు.

రోహిత్ తో గొడవ పడే త్రిగుణ్ ఆట కి అందరూ ఫ్యాన్స్ అయ్యారు. కానీ రోహిత్ మాత్రం త్రిగుణ్ ని ట్రిగ్గర్ చెయ్యడం.. అతని నుంచి మాటలు బయటికి రప్పించి హోస్ట్ తో తిట్టించేవాడు. మధ్యలో సుధీర్, ముఖేష్ లతో గొడవైనప్పటికీ తర్వాత కలిశారు. రోహిత్ వెళ్ళకముందు నుంచి ముఖేష్ తో త్రిగుణ్ కి పడడం లేదు. నామినేషన్స్ లో త్రిగుణ్ పెట్టే పాయింట్స్ అతను చేసే ప్రోవోకింగ్ అన్నీ నామినేషన్స్ కి హైలెట్.

కానీ త్రిగుణ్ ప్రతి ఒక్కరి నామినేషన్స్ లో కలగజేసుకుంటాడు, నోరు పారేసుకుంటాడు. గత రాత్రి ముఖేష్, వర్షిణి ల విషయంలో త్రిగుణ్ ప్రతి ఒక్కరి నామినేషన్స్ లో దూరిపోతాడు. ఒకొనొక సందర్భంలో ఆయన అభిమానులే బాబోయ్ త్రిగుణ్ కి ఎవరైనా చెప్పండయ్యా అనవసరంగా మాట్లాడి హోస్ట్ తో తిట్లు తింటాడు అంటూ మొత్తుకుంటున్నారు.

మరోపక్క రోహిత్ వెళ్ళాక త్రిగుణ్ బ్యాచ్ మొత్తం ముఖేష్ అండ్ వర్షిణి ని టార్గెట్ చేసారు.. ముఖేష్ ని మాట్లాడకుండా టార్గెట్ చేసారు అంటూ ముఖేష్ కి సింపతీ క్రియేట్ అవడం త్రిగుణ్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. అందుకే త్రిగుణ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.
 

Bigg Boss Telugu 10: Reward and Revenge Nominations