చిన్న సినిమా.. అయినా తగ్గదేలే
Summer Holidays to release this friday
రేపు శుక్రవారం రెండు పెద్ద డబ్బింగ్ చిత్రాలైన రామాయణ, సూర్య సీన్ చిత్రాల నడుమ చిన్న చిత్రంగా తెలుగులో తెరకెక్కిన సమ్మర్ హాలిడేస్ నలిగిపోతుందేమో అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. కానీ దర్శకనిర్మాతలు తమ చిత్రం ఎలాగైనా సత్తా చాటుతుంది అని బలంగా నమ్మడమే కాదు..
అందుకు తగ్గ ప్రమోషన్స్ తో సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. సమ్మర్ హాలిడేస్ ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ అన్ని ఈ చిన్న సినిమాపై హైప్ ని పెంచేస్తున్నాయి. రామాయణ ప్రీమియర్స్ కి ఇప్పటికే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. మరోపక్క సూర్య వరస హిట్స్ తో ఉన్నప్పటికి.. తెలుగులో సీన్ ఓపెనింగ్స్ పై ఇంకా అనుమానాలున్నాయి.
చిన్న సినిమా, చిన్న సినిమా అనడమే కానీ.. సమ్మర్ హాలిడేస్ చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని, ఇంకా టీమ్ చేసిన ప్రమోషన్స్ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యబోతున్నాయనిపిస్తుంది. సమ్మర్ హాలిడేస్ టైటిల్ పెట్టుకుని వింటర్ లో వస్తున్నారని అడిగితె.. సరదాగా నిర్మాత నాని అన్న దసరా సినిమా దసరాకి వచ్చిందా..
అలాగే ఈ సమ్మర్ హాలిడేస్ సినిమా సమ్మర్ కి రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వచ్చాం అనేది కాదు, బుల్లెట్ దిగిందా. లేదా అనేది కావాలి అంటూ చాలాల కాన్ఫిడెంట్ గా సమాధానమిచ్చారు. మరి చిన్న సినిమానే కానీ ఎక్కడా తగ్గట్లే.















































