ఓటీటీ కి కలిసిరాని హీరోయిన్
OTT platforms are not proving favorable for Keerthy Suresh
చాలామంది హీరోయిన్స్ సిల్వర్ స్క్రీన్ పై ఇటు డిజిటల్ ప్లాట్ పై ఒకేసారి అదృష్టాన్ని పరిక్షించుకుంటారు. కొంతమంది సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు తగ్గితే డిజిటల్ ఎంట్రీ ఇస్తారు, కొందరు వెండితెర అవకాశాలు బావున్నా డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వెళతారు. వెండితెరపై చిన్న చిన్న అవకాశాలు ఉన్నా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు భయపడేవారు ఉంటారు.
కానీ సిల్వర్ స్క్రీన్ పై అవకాశాల జోరు ఉన్నా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై అవకాశాలు కోరుకునే వారి లో నటి కీర్తి సురేష్ ముందుంటుంది. రీసెంట్ గా కీర్తి సురేష్ అక్కా తో డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశపరిచింది. ఆమె సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ అయినట్లుగా ఓటీటీకి కలిసి రావడం లేదు.
కీర్తి సురేష్ కంటెంట్ చేసిన ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. కరోనా టైమ్ లో పెంగ్విన్ చేసింది. అది ఓటీటీ లో రిలీజ్ అయ్యి డిజప్పాయింట్ చేసింది. తర్వాత చిన్ని, ఉప్పుకప్పురంబు ఇవన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన అక్క చిత్రానికి కనీసం మిక్స్డ్ రెస్పాన్స్ కూడా రాలేదు.
ప్రస్తుతం కీర్తి చేతిలో తెలుగు, తమిళ సినిమాలు ఉన్నాయి. తెలుగులో జనవరి 12 విడుదల, రౌడీ జనార్దన్ లాంటి డిఫ్రెంట్ జోనర్ మూవీస్లో నటిస్తుంది. అలాగే తమిళనాట బిజీగా వున్న తార కీర్తి సురేష్ కి ఓటీటీ మాత్రం కలిసిరావడం లేదు.















































