రోహిత్ ని మిస్ అవుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్

Bigg Boss fans are missing RohitBigg Boss fans are missing Rohit


నిన్నటివరకు ఇలాంటి వాడు బిగ్ బాస్ హౌస్ కి అవసరమా, అతను నస కేండేట్, అతని ఓవరేక్షన్ చూడలేక చచ్చాం, షాలిని తో పాటుగా అతను కూడా ఎలిమినేట్ అయితే బావుండేది అని రోహిత్ గురించి అనుకున్న బుల్లితెర  ప్రేక్షకులు నేడు రోహిత్ ని హౌస్ లో మిస్ అవుతున్నారు.

అగ్నిపరీక్షలో అమాయకంగా ఆటలాడి, అభిమానులను సంపాదించుకుని.. హౌస్ లో మొదటి రెండు వారాలు అదిరిపోయే పెరఫార్మెన్స్ చూపించి మూడో వారం నుంచి ఆట మానేసి శాలినితో ఆటకంటే ఎక్కువ ఫ్రెండ్ షిప్ చేస్తూ అందరి కంటెస్టెంట్స్ ని అతను ఎనాలసిస్ చేస్తూ ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఉంటారు అంటూ మాట్లాడిన రోహిత్ నేడు హౌస్ లో లేడు.

రోహిత్ ఓవర్ కాన్ఫిడెంట్, రోహిత్ గర్వం, రోహిత్ వల్గారిటీ మాటల ఎఫెక్ట్ అన్ని ఆడియన్స్ లో ఒకొనొక సమయంలో చిరాకు తెపించాయి. ముఖేష్, త్రిగుణ ఇలా ప్రతి ఒక్కరితో గొడవపడిన రోహిత్ ని ఆడియన్స్ చిరాకించుకున్నారు. అలంటి వాడు వెళ్లిపోతుంటే హౌస్ మేట్స్ లో ఎవ్వరూ ఎమోషనల్ అవ్వలేదు. ఒక్క నీతూ తప్ప.

ఆడియన్స్ కూడా హమ్మయ్య అనుకున్నారు. కానీ సోమవారం మాత్రం రోహిత్ ని మిస్ అవుతున్నామంటున్నారు. రోహిత్, త్రిగుణ ల సంభాషణ చాలామందికి నచ్చింది. రోహిత్ అనే వాడు లేకపోతె త్రిగుణ ఎలా హైలెట్ అవుతాడు, అతన్ని ఎవరు ఎలివేట్ చేస్తారంటూ మాట్లాడుకుంటున్నారు. నామినేసన్స్ లో ఒక్కసారి మాత్రమే పెరఫార్మెన్స్ చూపించే రోహిత్ ఆ నామినేషన్స్ లో లేని లోటు కనిపిస్తుంది అంటున్నారు.

Bigg Boss Telugu 10: Rohit Eliminated