ఆదర్శానికి కూడా వదలవా స్వామి?
Aadarsha Kutumbam gets ticket hike permission from AP govt
నిర్మాత నాగవంశీ జైలర్ 2 చిత్ర తెలుగు హక్కులు కొని విడుదల చేసారు. అయితే డబ్బింగ్ చిత్రానికి టికెట్ రేట్లు పెంచమని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగి టికెట్ రేట్ల పెంపుకు, ఎక్స్ట్రా షో కి అనుమతి తెచ్చుకుని ట్రోల్ అయ్యారు. డబ్బింగ్ మూవీస్ కి టికెట్ రేట్లు హైక్ ఏమిటి అంటూ నాగవంశీని తిట్టిపోశారు.
ఇప్పుడు నాగవంశీ నిర్మాతగా తెరకెక్కిన ఆదర్శ కుటుంబం చిత్రానికి కూడా రేట్లు పెంచాలని అడగడం ఏపీ ప్రభుత్వం ఆదర్శ కుటుంబం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. సింగిల్స్ స్క్రీన్స్ లో రూ.50. మల్టిప్లెక్స్ ల్లో రూ. 75 విత్ GSTతో పెంచుకునేందుకు, మొదటి పది రోజులు ఐదు షోస్ కి అనుమతి వచ్చేసింది.
అది చూసాక త్రివిక్రమ్-వెంకీ తో తెరకెక్కించిన ఇది రేంజ్ సినిమాకి కూడా నాగవంశీ టికెట్ రేట్లు పెంచమని వెళ్ళాడు, అసలు నాగవంశీ మారడు, భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని అడగడంలో అర్ధం ఉంది, కానీ మిడ్ రేంజ్ సినిమాకి టికెట్ రేట్లు హైక్ ఏమిటో అంటూ అప్పుడే సోషల్ మీడియాలో నాగవంశీని ఏసుకుంటున్నారు.
















































