ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Season 10: Thrigun nominates Varshini

BB10: నిన్న ప్రేమ-ఈరోజు ఫ్రెండ్ షిప్ బ్రేక్

Bigg Boss Season 10: Thrigun nominates VarshiniBigg Boss Season 10: Thrigun nominates Varshini


బిగ్ బాస్ సీజన్ 10 లో నిన్న ఆదివారం ఎపిసోడ్ లో ప్రేమపక్షులను ఆడియన్స్ విడగొట్టేసారు. బిగ్ బాస్ లో లవ్ బర్డ్స్ గా ప్రొజెక్ట్ అయిన రోహిత్-షాలిని లకు ఎవరెన్ని చెప్పినా వారి బిహేవియర్ మార్చుకోలేదు. దానితో షాలిని ని ఇంటికి పంపేసి ఆడియన్స్ రోహిత్, షాలిని జంటను విడగొట్టేసారు.

కానీ ఈరోజు హౌస్ లో ఉన్న కనికనిపించని ఫ్రెండ్ షిప్ కూడా బ్రేక్ అయ్యింది. మొదటినుంచి బిగ్ బాస్ హౌస్ లో త్రిగుణ, వర్షిణి మంచి ఫ్రెండ్స్, కానీ ఎవరికీ తెలియకుండా ఆ ఫ్రెండ్ షిప్ ని మైంటైన్ చేస్తున్నారు. ముందు నుంచే అంటే బయటే వారు మంచి ఫ్రెండ్స్, హౌస్ లో ముఖేష్ బ్యాచ్ తో తిరిగే వర్షిణి అటు త్రిగుణ తోనూ బాగుంటుంది.

కానీ ఈ వారం నామినేషన్స్ లో త్రిగుణ వర్షిణి ని నామినేట్ చెయ్యడం హాట్ టాపిక్ అవడం అలా ఉంచి, వర్షిణి కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు, త్రిగుణ నువ్ ఫ్రెండ్ షిప్ ని బ్రేక్ చేసి నీ పర్సనాలిటీ ఏమిటో ఈరోజు చూపించావ్ అంది, కానీ త్రిగుణ నాకు టాస్క్ లో నువ్వు చేసిన పని నచ్చలేదు అంటూ మాట్లాడాడు.

దేబ్జానీ జాన్సీని నామినేట్ చెయ్యగానే ఆమె ఏడుపందుకుని సింపతీ కార్డు ప్లే చేసింది. అమన్ సుధీర్ ని నామినేట్ చేసాడు, త్రిగుణ రోహిత్ ని నామినేట్ చేసాడు, నీతూ మాస్టర్ ఝాన్సీని నామినేట్ చేసింది. ఈరోజు హౌస్ లో నామినేషన్స్ సమయం లో ఆర్గ్యుమెంట్స్  కన్నా ఎక్కువగా ఎమోషన్స్ కనిపించాయి. 

Bigg Boss Season 10: Nomination tension and unexpected twists